Pages

Sunday, January 24, 2010

No offence to Srinivases! :)

నాకెందుకో 'శ్రీనివాస్' అనే పేరు నచ్చదు. 'ఎందుకో' అనేముందిలే... దానికి చాలా కారణాలున్నాయి. ఈ 'శ్రీనివాస్' నామధేయం పట్ల గల ద్వేషానికి అంకురార్పణ నా బాల్యం లోనే జరిగింది.



మా ఇంటి పక్కనే ఉండే వాడు నా జీవితం లో మొదటి 'శ్రీనివాస్'. వాడికి మూడు, నాకు రెండు - ఏళ్ళు, పళ్ళు కూడానూ. పళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఉంది. నాకొక సారి మా నాన్న గారు బొంబాయి నుంచి కనురెప్పలు తెరిచీ, మూసే బొమ్మ తీసుకొచ్చారు. నాకా వయసు లోనే ఆ బొమ్మ భలే నచ్చి ఆడుకుంటుంటే ఆ శ్రీనివాస్ గాడొచ్చి బొమ్మ లాక్కొని దాని కనురెప్ప కాస్తా పీకేసాడు. ఆడంగి వెధవ కాకపోతే ఆడపిల్ల బొమ్మ వాడికెందుకు? నాకు రోషమొచ్చి వాడ్ని కసి దీరా కొరికేసాను. ఒరిజినాలిటీ లేని వెధవ కనక వాడూ అదే పని చేసాడు. మేమిద్దరం ఆ కనురెప్ప ఊడిపోయిన బొమ్మ మధ్యలో వేస్కొని గట్టిగా ఏడుస్తుంటే మా respective మాతృ మూర్తులు మమ్మల్ని విడదీసి stapler కొట్టినట్టు కొరుక్కున్నమా అరచేతుల్ని నిమురుతూ మమ్మల్ని తీస్కెళ్ళిపోయారు. ఆ శ్రీనివాస్ దంష్ట్రాఘాతం తాలూకు గాయాలు ఎప్పటికీ మాయనివని నాకప్పుడు తెలీలేదు.

నేను చదువులో ఎప్పుడు ఫస్టే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నా మార్కులు మా కాలేజీ కే ఒక రికార్డు. నా జూనియర్స్ అందరూ నన్నెంత ఆరాధనగా చూసేవారనీ! నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఓ మగ గొంతు నన్ను 'అక్క' అని పిలిచినట్టు అనిపించింది. నాకు కొత్తగా పుట్టుకొచ్చిన తమ్ముడు ఎవరా అని వెనక్కి తిరిగి చూసా. గుండ్రటి అమాయకపు కళ్ళే స్కోని , నున్నగా జుట్టు దువ్వుకొని మహా గుడ్ బాయ్ లా ఒక కుర్రాడు నుంచొని ఉన్నాడు. 'అక్కా, మీరు కాలేజీ టాపర్ అట కదా... నాకు కొన్ని సబ్జెక్ట్స్ లో డౌట్స్ ఉన్నాయి... చెప్పరా... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అన్నాడు. నాకు వాడ్ని చూస్తే భలే ముచ్చటేసింది. 'నాకే ఒక తమ్ముడుంటే' అనుకుంటూ 'సర్లే చెప్తాను' అని అభయం ఇచ్చేశాను. దానికి వాడు ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు పిచ్చి సన్నాసి. వాడు వెళ్లి పోబోతుంటే అడిగాను 'ఇంతకీ నీ పేరేంటి తమ్ముడూ' అని. 'శ్రీనివాస్ అక్కా... రేపు పొద్దున్న నాల్గింటికి మీ ఇంటికి వచ్చేస్తానే' అని వెళ్ళిపోయాడు.

నేను ఒక 'శ్రీనివాస్' కి సహాయం చెయ్యడమా? వాడ్ని 'తమ్ముడూ' అని పిలవడమా? నా ద్వేషాగ్ని ప్రజ్వరిల్లింది. వాడ్ని తప్పించుకొని తిరగడం మొదలు పెట్టాను. కానీ వాడూ పట్టువదలని శ్రీనివాసుడే! రోజూ నాల్గింటికి ఎండనకా, వాననకా మా ఇంటికొచ్చి కూర్చోనేవాడు. ఇంకేం చెయ్యగలం? ఇష్టం లేకుండానే 'అరువు అక్క' నైన పాపానికి వాడికి చెప్పగలిగిందంతా చెప్పి పరీక్ష అయిన్దనిపించాను. ఫలితాలు వచ్చాక చూద్దును కదా ఆ గురుద్రోహి నా రికార్డు నే బద్దలు కొట్టేసాడు. గురువుగా గెలిచానో, విద్యార్ధిని గా ఓడానో తెలీక జస్టిస్ చౌదరి లెవెల్లో బాధపడ్డాను!

ఇక ఈ శ్రీనివాస్ అనే పేరు నా దరిదాపుల్లో రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను. కాని నా దురదృష్టం పుచ్చి మన సమాజం లో ఎక్కడ పడితే అక్కడ 'శ్రీనివాస్' లే! ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే ఎక్కువ మంది పెట్టుకొనే పేరు 'మొహమ్మద్' అని తేలిందట. హు... వాళ్ళకి ఈ చాప కింద నీరు లాంటి శ్రీనివాస్ పేరు తెలియదు. అరె... ఎవరు పడితే వాళ్ళే శ్రీనివాస్. ఏ ఎగ్జిబిషన్ కో మాల్ కో వెళ్లి 'శ్రీనివాస్' అని గట్టిగా అరిస్తే సగానికి పైగా మగవాళ్ళు పరిగెత్తుకొస్తారు. పెద్దైన తర్వాత ఓ మోస్తరు refined taste కూడా ఏర్పడిందేమో... ఈ common place పేరంటే ఇంకా అయిష్టం పెరిగింది.

నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్న అమ్మ, నాన్నలకి చెప్పేసాను. జంబూక నాథ్ అనే పేరున్న కటిక పేదవాణ్ణి అయినా చేస్కుంటాను కాని 'శ్రీనివాస్' అనే పేరున్న శ్రీమంతుని చచ్చినా చేస్కోనని.అదేదో సినిమా లో ఆ హీరోయిన్ ఒకే పేరు పట్టుకొని వేళ్ళాడితే ఆఖరికి ఆ పేరున్నవాడు దొరికాడు. అలాంటిది నేను black list చేసిన పేరు కాక ఇంకా కొన్ని లక్షల పేర్లున్నాయి... నా ఛాన్స్ ఏ ఎక్కువ కదూ!

7 comments:

BADARI said...

Hi,
Hilarious............I am so glad I am not a Srinivas...must thank my parents for that...(I couldn't have afforded such animosity from you if I was one)..Nice to see you back on the blog, may be this will spur me on to blogging on....I must confess it was your blogs that made me take up to blogging in the first place.....by the way Do you still bite???....kidding...

Sowmya said...

ha ha thanks so much Sir! your comment is equally hilarious :D and yes, awaiting your blogs too!

Dev said...

Hi Sowmya...
My name is Srinivas..... i too hate my name. but ....but this is too much u shouldn't judge a book by it's cover or by name!! :-)

Any ways,the story is fun.

Anonymous said...

Neevu saamaanya sthreevi kaavu ...

NENU

sreenivas erukulla said...

Hi I am srinivas but nevu chappina srinivas kadu

nevu chappindi chala thappu yandukantaa andaru srinivaslu ookala vundaru ok na....?

Sreenivas Paruchuri said...

Sowmya-gaaru,

While searching for some Telugu lalita sangeetam I stumbled upon your blog.

The following post on Soc.Culture.Indian.Telugu, the Usenet Telugu discussion group, was a mega-hit in early 1990s. You may like it :).

https://groups.google.com/forum/?fromgroups=#!topic/soc.culture.indian.telugu/Z-zr0By38p4

Regards from one more Sreenivas

P.S. Thanks for those nice renditions of "kaDachEnaTE sakhiyaa" and "svatantra bhaarata janayitri"! If needed, I shall be glad to send the AIR-version of the latter song.

kaachi said...

I am Srinivas with 'an'= Srinivasan. It was a little painful reading. But, it was a great read. Hilarious!!