"నేను కవిని కాను" అంటూ ఓ ధోరణిలో మొదలెట్టాడు మా పద్య నరకాసురుడు. "అదే విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక చచ్చా ఇన్నాళ్ళూ! నీకే తట్టింది, సంతోషం" అని అక్కణ్ణుంచీ లేచొచ్చేశా నేను.
నిజంగానే మావాడు కవి కాదు.
కానీ తెలుగు పద్యం అంటే మాత్రం వల్లెవేసేంత అభిమానం! (తెలుగు పద్యం కనబడితే దాన్ని వల్లెవేసే వరకూ ఊరుకోడు). ఇంత వరకూ బానే ఉంది కాని మా వాడి ధారణ శక్తి తోనే చిక్కు సమస్య వచ్చి పడింది. వాడికి యే పద్యం ఆసాంతం ఙాపకం ఉండదు. ఎక్కడెక్కడో చదివిన పద్యాలన్నీ వాడి బుర్రలో కలగా పులగం అయిపోయి చిలువలు పలువలుగా బయటికి వస్తుంటాయి!
"అనువు గాని చోట అధికులమనరాదు; సజ్జనుండు పలుకు చల్లగాను" అంటాడు! రెంటికీ సామ్యము వివరింపుడీ అంటే "ఏవుందీ, అనువుగాని చోట సజ్జనుడు చల్లగా పలుకుతాడని అర్ధం!" అని వివరిస్తాడు.
ఇంకోసారి " గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖగము పాలు" అంటాడు! బాబూ, ఖగం కాదు ఖరం; ఖరం అంటే గాడిద, ఖగం అంటే గద్ద, గద్ద పాలెందుకు ఇస్తుందంటే వినడు.
ఒకసారి 'తన కోపమే తన శత్రువు అన్నాడు వేమన" అన్నాడు. అది నిజం కాదు అన్నాన్నేను! "తన కోపమే తన శత్రువు కాదంటావా?" అని నన్ను శత్రువు ని చూసినట్టు కోపంగా చూసాడు. కాదు, కాదు ఆ ముక్క చెప్పింది బద్దెన అని అతనికి వివరించేసరికి తాతలు దిగొచ్చారు.
ఇలా పద్యాల పదాల్నీ, చరణాల్నీ, శతక కర్తల్నీ తారుమారు చేసేస్తూ ఖండ ఖండాలు చేసేస్తుంటాడు కాబట్టే అతనికి పద్య 'నరకా'సురుడనే పేరు తటస్థించింది. ఇతగాడు శతక కర్తల్నే కాక దేవుళ్ళని కూడా తారుమారు చెయ్యగల సమర్ధుడు సుమండీ!
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, తోరపు బొజ్జయు వామ హస్తమున్ లో కృష్ణ గణపతులను ఒకే సారి కీర్తించేస్తాడు!
గద్యంలో కొన్ని పేజీల్లో చెప్పగల విషయాన్ని పద్యంలో సులువుగా చెప్పచ్చంటారు! మా నరకాసురుడి పద్య వధ ని వివరించడానికి ఈ చిన్ని పద్యాంకం చాలదూ!
"సిరికిం జెప్పడు శంఖు చక్రయుగముం జేదోయి సంధింపడే శ్రీ కాళహస్తీశ్వరా!"

3 comments:
hilarious!! navvukoleka chachanu...
I am unable to guess your age after reading the content and seeing a small photo on your blog site.
I don't know if you are the one who wrote the Telugu story "Siesta" in the Eenadu Telugu Sunday supplement on 15 August 2010.
I enjoyed reading every bit of that story. It is extraordinary. It reflects the general tendencies of our folks desiring to take a nap in afternoon.
Your command of Telugu language and the style in which you narrated this story is commendable. People are busy today. We can't enjoy little pleasures like siesta in such circumstances around us.
My email id is rajayogi@live.com
If you enjoy friendship with one that is interested in things like you do, like writing, you can communicate to me.
My hearty congratulations to you for being such a great writer.
akka....nee posts chaduvuthunte...library lo andaru nannu vintaga choosthunnaru....navvu aagatledu mari emi chesedi!
ayyo narakasura!
Post a Comment